ETV Bharat / state

ఆభరణాలు అదృశ్యం...అసలు విషయం గోప్యం..! - chittoor

తిరుమల టిక్కెట్లపై ఆర్టీసీ అన్యమత ప్రచారం వివాదం సద్దుమణగక ముందే......తితిదేలో మరో వివాదం కలకలం రేపింది. తితిదే ఖజానా నుంచి ఆభరణాలు మాయమయ్యాయన్న వార్త ఆలస్యంగా వెలుగు చూడటంతో... ఈ విషయంపై తితిదేలో వాడీవేడి చర్చకు దారి తీసింది. మంగళవారం ఉదయం ఆభరణాల మాయం వ్యవహారం బయటకు రావడం.... తితిదే వ్యహరిస్తున్న తీరును భాజపా నేతలు ఖండించటం.... సాయంత్రానికి ఈవో అనిల్ సింఘాల్ వ్యవహారంపై వివరణ ఇవ్వటం అన్నీ ఒకదాని వెంట ఒకటి జరగగా... అసలు తితిదేలో ఏం జరుగుతుందో అన్న అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

తితిదే
author img

By

Published : Aug 28, 2019, 5:26 AM IST

నిత్య వివాదాలకు అడ్డాగా తితిదే

తితిదేలో రోజుకో వివాదం బయటపడుతోంది. ఖజానా నుంచి ఐదుకేజీల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు, రెండు హారాలు మాయమయ్యాయన్న వార్త.. మరో వివాదానికి దారి తీసింది. మొత్తం వ్యవహారంలో సుమారు 7లక్షల 36 వేల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. ఈ సంగతి 2018 మే 5నే తితిదే దృష్టికి రాగా... అప్పటి ట్రెజరీ ఏఈవోగా ఉన్న శ్రీనివాసులు జీతం నుంచి మాయమైన అభరణాల విలువను వసూలు చేస్తున్నారన్న విషయం బయటపడింది. అసలు నగలను ఎవరు మాయం చేశారన్న వ్యవహారంపై పెద్ద దుమారమే చెలరేగింది. ఏడాదిగా వ్యవహారం నడుస్తున్నా.. తితిదే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచటంపై సర్వత్రా విమర్శలు ఎదరవుతున్నాయి.

హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలి: భాజపా

ఆభరణాల మాయం వ్యవహారాన్ని ఖండించిన భాజపా రాష్ట్ర కార్యదర్శి, తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. తితిదే అవలంబిస్తున్న విధానాన్ని తప్పు పట్టారు. వ్యవహారంలో ఒక్క ఏఈవోనే బాధ్యుడ్ని చేయటం భావ్యంగా లేదన్నారు. అన్ని ఆభరణాలు ఒకే వ్యక్తి ఎలా మాయం చేస్తారంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అసలు ఈ ఆభరణాల మాయం వ్యవహారంలో ఏం జరిగిందో తితిదే ఈవో వివరణ ఇవ్వాలని కోరారు.

విచారణ చేపట్టాం.. దోషులపై చర్యలు తీసుకుంటాం: ఈవో సింఘాల్

ఆభరణాల మాయం వ్యవహారంపై తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పందించారు. తితిదే ఖజానా నుంచి ఆభరణాల మాయం వ్యవహారంలో.. పోయిన ఆభరణాల మొత్తాన్ని ఏఈవో జీతం నుంచి రికవరీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మరో వైపు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. దోషులు ఎవరనేది తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ట్రెజరీ బాధ్యతలు శ్రీనివాసుల నుంచి మరో వ్యక్తికి మార్చినప్పుడే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. నగల అప్పగింతలో లోటు ఉందని ఏఈవో అంగీకరించినట్టు సంతకం పెట్టారని తెలిపారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కనుక జాగ్రత్త వహించామన్నారు.
భాజపా నేతల ఆగ్రహం, ఈవో వివరణ ఎలా ఉన్నా... అసలు ఆభరణాలు ఎలా మాయమయ్యాయన్న ప్రశ్నల్లో ఇప్పటికీ సందిగ్ధత వీడలేదు. పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాతనే వాస్తవాలు వెల్లడవుతాయని ఈ వో ప్రకటించగా.... అసలు తితిదే ట్రెజరీలో ఏం జరిగిందనే అంశం ఏడుకొండల వాడికే తెలవాలని భక్తులు అంటున్నారు.

ఇది కూడా చదవండి.

నగల మాయంపై పూర్తిస్థాయి విచారణ: తితిదే ఈవో

Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం లో మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 47 శాతం పోలింగ్ నమోదైంది పలుచోట్ల ప్రారంభంలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులుతీరారు

Body:palakonda

Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.