తిరుమల తిరుపతి దేవస్థానం పరిదిలోని స్థానిక ఆలయాల కార్యకలాపాలపై అధికారులతో ఈవో జవహర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆలయాలకు సంబంధించిన స్థల పురాణం, ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ తితిదే వెబ్సైట్, ఎస్వీబీసిలో ప్రచారం నిర్వహించాలన్నారు. తిరుపతిలోని భక్తుల వసతి సముదాయాలు పద్మావతి నిలయం, శ్రీనివాసం, విష్ణునివాసం పాటు ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్లో ఆలయాల గురించి భక్తులకు తెలిపేలా బోర్డులు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
టూరిజం, ఆర్టీసీ అధికారులతో సంప్రదించి ప్యాకేజి టూర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్థానిక ఆలయాల్లో ఆర్జిత సేవలు ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలన్నారు. విలీన ఆలయాల్లో ఆదాయం, ఖర్చుకు వ్యత్యాసం లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. ఆలయాల అవసరాలను బట్టి ఉద్యోగుల సంఖ్యను నిర్ధారించాలని చెప్పారు.
ఇదీ చదవండి: