ETV Bharat / state

దర్శనం టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించిన తితిదే ఈవో

author img

By

Published : Dec 22, 2020, 6:56 PM IST

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం, సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలను తితిదే ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 24న సర్వదర్శన టోకెన్లను తితిదే జారీ చేయనుండగా.. లక్ష మందికి దర్శనం కల్పిస్తూ టోకెన్లను అందుబాటులో ఉంచనుంది.

Ttd Eo Jawahar Reddy inspected
దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన తితిదే ఈవో

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం, సర్వదర్శనం కోసం టోకెన్లు జారీ చేయనున్న కేంద్రాలను తితిదే ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. తిరుపతిలో టోకెన్ల జారీ కోసం ఐదు ప్రాంతాల్లో 50 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోజుకు పది వేల చొప్పున పది రోజుల పాటు లక్ష మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తూ.. ఈ నెల 24న సర్వదర్శన టోకెన్లను తితిదే జారీ చేయనుంది.

నగరంలో సర్వదర్శనం టోకెన్ల జారీ చేసే కేంద్రాల్లో.. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను ఈవో పరిశీలించారు. టికెట్లు జారీ చేసే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవోతో పాటు అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్​వో గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. 10 రోజులు అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.