ETV Bharat / state

ఈహెచ్ఎస్ నిర్ణయం విరమించుకోవాలని తితిదే ఉద్యోగుల వినతి - ttd employees request to withdraw EHS decision

తితిదే ధర్మకర్తల మండలి తమ ఉద్యోగులను ఈహెచ్ఎస్ పరిధిలోకి చేర్చాలని నిర్ణయించింది. దీనిపై తితిదే ఉద్యోగులనుంచి వ్యతిరేకత వినిపిస్తోంది. స్కీమ్‌ వల్ల తమకు వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువని ఆవేదన చెందుతున్నారు. ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ తితిదే ఛైర్మన్‌, ఈవోలకు వినతి పత్రం అందజేశారు.

ttd employees request
తితిదే ఉద్యోగుల వినతి
author img

By

Published : Nov 28, 2020, 8:50 PM IST

తమను ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ పరిధిలోకి చేర్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని తితిదే ధర్మకర్తల మండలి ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహార్‌ రెడ్డిలకు వినతి పత్రం అందజేశారు.

ఈ నిర్ణయంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు వాపోయారు. ధర్మకర్తల మండలి పునరాలోచన చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

రహదారిపై గార్గేయ ప్రవాహం.. రాకపోకలకు ఆటంకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.