శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మావతి అతిథి గృహంలో అదనపు ఈవో ధర్మారెడ్డితో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్‌ను శాలువాతో తితిదే ఛైర్మన్ సత్కరించారు. ఈ సందర్భంగా కోవిడ్-19 వ్యాప్తి నివారణ కోసం తిరుమలలో చేపడుతున్న కార్యక్రమాలను ఛైర్మన్ సుబ్బారెడ్డి..లెఫ్టినెంట్ గవర్నర్‌కు వివరించారు.
తితిదే ఛైర్మన్‌ను కలిసిన ఈవో కె.ఎస్ ధర్మారెడ్డి..
తితిదే ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డిని తితిదే ఈవో కేఎస్ జవహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తితిదే ఈవో గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఛైర్మన్ సుబ్బారెడ్డితో తొలిసారిగా తిరుమలలోని ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురూ పాలనా సంబంధిత పలు అంశాలపై చర్చించుకున్నారు
తితిదే ఛైర్మన్‌ను కలిసిన ఎస్వీబీసీ నూతన ఛైర్మన్..
ఎస్వీబీసీ నూతన ఛైర్మన్‌గా నియమితులైన సాయికృష్ణ యాచేంద్ర... తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయికృష్ణ యాచేంద్రకి శుభాకాంక్షలు తెలిపిన తితిదే ఛైర్మన్...హిందూ ధార్మిక ప్రచారంలో ఎస్వీబీసీని మరింత ముందు తీసుకెళ్లాలని సూచించారు. వీక్షకుల నుంచి వస్తున్న ఆదరణను మరింత పెంచాలని కోరిన తితిదే ఛైర్మన్... ఇతర భక్తి ఛానళ్లకు ధీటుగా ఎస్వీబీసీలో కార్యక్రమాలను రూపొందించాలన్నారు.
ఇదీ చదవండి: