ఇదీ చదవండి :
తితిదే ఛైర్మన్ తికమక ... ఒకే ప్రశ్నకు రెండు సమాధానాలు - TTd chairman conflicted statements
తితిదే ధర్మకర్తల మండలి సమావేశం వివరాలు తెలియజేసే సందర్భంలో ఆసక్తికర సంఘటన జరిగింది. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమావేశ వివరాలు తెలిపిన అనంతరం విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ... తికమక సమాధానాలు ఇచ్చారు.
తితిదే ఛైర్మన్ తికమక ... ఒకే ప్రశ్నకు రెండు సమాధానాలు
ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి పనులపై చేసిన తీర్మానాలను తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మీడియాకు వివరించే సమయంలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సమావేశ వివరాలు మీడియాకు తెలియజేసిన అనంతరం విలేకరుల ప్రశ్నలకు సుబ్బారెడ్డి సమాధానం ఇస్తూ క్షణాల వ్యవధిలోనే భిన్నమైన ప్రకటనలు చేశారు. తితిదే ప్రతిష్టకు భంగం కలిగించారని 200 కోట్ల రూపాయలు చెల్లించాలని కోరుతూ గత పాలక మండలి పరువునష్టం దావా వేసిందని ఆ కేసుపై ప్రస్తుత పాలకమండలి వైఖరేంటని విలేకరులు ప్రశ్నించారు. తితిదే ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని... కేసు కొనసాగుతుందని సుబ్బారెడ్డి మొదట ప్రకటించారు. గత పాలక మండలి వేసిన పరువునష్టం కేసు పూర్వపరాలను ఛైర్మన్ పక్కనే ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి వివరించాక తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మరో సమాధానం ఇచ్చారు. ఆ కేసు ఉపహరించుకుంటామని చెప్పి హడావుడిగా మీడియా సమావేశానికి ముగింపు పలికారు.
ఇదీ చదవండి :
sample description