తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం ఏర్పాటు చేశారు. కొంత సమయానికి సమావేశం నుంచి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజు బయటకు వెళ్లిపోయారు. మళ్లీ వారు తిరిగి రాకపోవడం కారణంగా సమావేశాన్ని విరమిస్తున్నట్లు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. బోర్డుకు తితిదే పాలకమండలి సభ్యులు చల్లా రామచంద్రారెడ్డి, పొట్లూరి రమేష్ బాబు రాజీనామా చేశారు. శ్రీవారి సన్నిధిలో స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేయలేమన్న తితిదే ఛైర్మన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని వెల్లడించారు.
నిలిచిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశం
నాటకీయ పరిణామాల మధ్య తితిదే ధర్మకర్తల మండలి సమావేశం నిలిచిపోయింది. సమావేశం నిర్వహించాలన్న సమాచారంతో ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన అన్నమయ్య భవన్లో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమైంది.