చిత్తూరు జిల్లా నగిరి మండలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసులో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. కొద్దికాలంగా నగిరి నియోజకవర్గంలో ట్రాన్స్ఫార్మర్లు దొంగతనానికి గురవుతున్నట్లు ఫిర్యాదులు ఎక్కువగా రావటంతో పోలీసులు నిఘా పెంచారు. ఈ మేరకు సత్రవాడ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టగా స్కూటర్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 109 ట్రాన్స్ఫార్మర్లను దొంగలించినట్లుగా పోలీసులు గుర్తించారు. వారి వద్దనున్న ఐదు లక్షల నగదు, ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించిన సీఐని డీఎస్పీ మురళీధర్ అభినందించారు.
ట్రాన్స్ఫార్మర్ల దొంగలు అరెస్టు.. రూ.5 లక్షలు స్వాధీనం - చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ పరిధిలో 109 ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించిన ఇద్దరు దొంగలను నగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనున్న స్కూటర్, దొంగతనానికి ఉపయోగించే పరికరాలను, ఐదు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.