అమరావతిని రాజధానిగా కొనసాగించాలని... నేడు తిరుపతిలో భారీ బహిరంగ సభ జరగనుంది. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. నగరంలోని భీమాస్ రెసిడెన్సీలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి... మూడు రాజధానులు వద్దు, ఒక్క రాజధాని ముద్దు అన్న నినాదంతో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పులే విగ్రహం నుంచి నాలుగు కాళ్ళ మండపం వరకు నిర్వహించే భారీ ర్యాలీలో... తెదేపా అధినేత చంద్రబాబు పాల్గోనున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వెల్లడించారు. ర్యాలీ అనంతరం బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏడు నియోజకవర్గాల ప్రజలు హాజరుకానున్నారన్నారు
తిరుపతిలో చంద్రబాబు పర్యటన
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని... నేడు తిరుపతిలో భారీ బహిరంగ సభ జరగనుంది. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.