చిత్తురూ జిల్లాలోని పడమటి మండలాల్లోని టమాట రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాడి భానుడి భగభగల దాటికి పంటలు బాగా దెబ్బతిన్నాయి. తంబళ్లపల్లి, మదనపల్లె, వాల్మీకిపురం, పుంగనూరు, పలమనేరు, పీలేరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నది. మదనపల్లె ప్రాంతంలో ఈ ఏడాది 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఎండ తీవ్రత వల్ల టమోట పంటకు నష్టం అతిపెద్ద మార్కెట్లో పరిస్థితి చూస్తే...! దేశంలోనే అతిపెద్ద టమాట మార్కెట్‌గా పేరొందిన మదనపల్లె మార్కెట్ యార్డులో టమాట ఎగుమతులు తీవ్రంగా పడిపోయాయి. ఎండవేడికి, సాగునీటి కొరత కూడా జనవరి నుంచి ఏప్రిల్, మే, జూన్ మాసాలలో సాగుచేసిన టమాట తీవ్రంగా దెబ్బతింది. జిల్లా పరిధిలో 42 వేల ఎకరాలలో టమాట సాగు అవుతుండగా...సగానికి పైగానే మదనపల్లిలోనే విస్తరించి ఉంది. మదనపల్లె టమాట మార్కెట్‌కు రోజుకు 700 నుంచి 750 టన్నుల వరకు టమాట రావాల్సి ఉండగా... కేవలం 500 టన్నులలోపే వస్తున్నాయి.
లక్షల్లో పెట్టుబడి..ఆదాయం..?ఆగస్టు మాసం ప్రారంభమైనా వేడి తీవ్రత తగ్గలేదని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పంటల్లో ఎదుగదల లేక కోనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపటం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. లక్షల రూపాయల్లో పెట్టుబడులు పెట్టామని..దిగుబడి మాత్రం పైసా కూడా రాలేదని వాపోతున్నారు.టమాట సాగుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఇది చూడండి: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో ఇక వర్షాలే..