తిరుపతి అర్బన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలను.. అడ్డుకునేందుకు 60 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. వీరు పది రక్షక్, 10 బ్లూ కోల్ట్ బృందాలుగా ఏర్పడి అనుక్షణం పహారా కాయనున్నట్లు తెలిపారు. గంజాయి వాడకం, మత్తు పానీయాల.. వంటి చట్టవిరుద్ధ చర్యలు జరగకుండా ఈ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు పోలీస్ స్టేషన్కి వచ్చే అవసరం రానీవ్వకుండా.. వారి శాంతి భద్రతలను క్షేత్రస్థాయిలో పరిరక్షించాలని తెలిపారు.
ఇదీ చదవండీ.. GOOD NEWS: 10,143 ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల