ETV Bharat / state

హోంగార్డు అసోసియేషన్ ప్రెసిడెంట్​ను సస్పెండ్ చేసిన ఎస్పీ - SP suspended the President of the Homeguard Association

పోలీసు శాఖ తరుపున ఉచితంగా అందించిన రెమిడిసివర్ ఇంజక్షన్​ను బాధిత కుటుంబానికి ఇచ్చి.. డబ్బులు వసూలు చేసిన హోంగార్డు అసోసియేషన్ ప్రెసిడెంట్​పై ఎస్పీ క్రిమినల్ కేసు నమోదు చేయించారు. వెంటనే అతడిని సస్పెండ్ చేశారు.

Tirupati Urban SP Venkata Appalanayudu
తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు
author img

By

Published : May 28, 2021, 9:39 AM IST

తిరుపతి అర్బన్ పోలీస్ పరిధిలో ధనుంజయ్ రెడ్డి అనే హోంగార్డు భార్యకు కరోనా సోకగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు రెమిడిసివర్ ఇంజక్షన్ అవసరం అని వైద్యులు చెప్పారు. సమాచారం తెలుసుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు.. ఇంజక్షన్ తెప్పించి.. హోంగార్డు అసోసియేషన్ ప్రెసిడెంట్ చెంగల్ రాయలుకి ఇచ్చారు. జిల్లా పోలీసు శాఖ ఉచితంగా ఇచ్చిన రెమిడిసివిర్ ఇంజక్షన్ ను రూ.20,400 తీసుకుని బాధిత కుటుంబానికి హోంగార్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెంగల్ రాయులు అందించారు.

విషయం తెలుసుకున్న ఎస్పీ బాధితుడి ఫిర్యాదుతో ఎమ్మార్​పల్లి పోలీస్ స్టేషన్​లో క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే చెంగల్ రాయులును సస్పెండ్ చేసి.. హోంగార్డ్స్ సంస్థ నుంచి తొలగించేందుకు సిఫార్సు చేశారు. పోలీస్ శాఖకు అప్రతిష్ఠ తీసుకువచ్చేలా.. ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని ఎస్పీ వెంకట అప్పలనాయుడు హెచ్చరించారు.

ఇదీ చదవండీ.. Mahanadu-2: ఇవాళ యుగపురుషుడికి తెలుగుదేశం ఘన నివాళులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.