ETV Bharat / state

నవ్వుల... హాసినీ గల్లంతు - hasini

పాపికొండల్లో పడవ ప్రమాదం ఎంతో మందికి విషాదం మిగిల్చింది... తిరుపతిలోని స్ప్రింగ్​ డేల్ పాఠశాల విద్యార్థులు శోకసంద్రంలో ఉన్నారు. పాపికొండల పర్యటనకు వెళ్లిన తమ స్నేహితురాలు హాసినీ... గల్లంతవ్వడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది... వారి స్నేహితురాలు చిరునవ్వులతో తిరిగి రావాలని వారందరూ కోరుకుంటున్నారు.

నవ్వుల... హాసినీ గల్లంతు
author img

By

Published : Sep 16, 2019, 2:09 PM IST

Updated : Sep 16, 2019, 4:16 PM IST

అంతా కలిసి సరదాగా జూకి వెళ్దామనుకున్నారు. అక్కడ పులులు...సింహాలు...చెంగు చెంగున ఎగిరే లేళ్లను చూసి ఆనందిద్దామనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అమ్మానాన్న బలవంతంతో పాపికొండల సందర్శనకు వెళ్లిన హాసినీని చూసి స్నేహితులంతా నిరాశ చెందారు. సరే వచ్చాక ఎన్నో కబుర్లు చెప్పుకుందామనుకున్నారు... చిరునవ్వులు చిందిస్తూ అందర్నీ పలకరించే హాసిని తిరిగి వస్తుందో రాదో అన్న బాధతో ఉన్నారు. తిరుపతి స్ప్రింగ్​ డేల్​ పాఠశాలలో చదువుతున్న హాసినీ పాపికొండల పర్యటనకు వెళ్లింది... నిన్న జరిగిన విషాదకర ఘటనలో తన తండ్రి సుబ్రహ్మణ్యంతోపాటు గల్లంతైన తమ స్నేహితురాలు హాసినీని తలుచుకుంటూ ఇప్పుడు తోటి విద్యార్థులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. హాసినీ నవ్వుల కోసం... స్నేహితులు, గురువులు బాధనిండిన గుండెలతో ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి

లైవ్ అప్‌డేట్స్: బోటు మునిగిన ప్రదేశాన్ని గుర్తించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

Intro:Ap_Vsp_91_16_Drm_Swachatha_Seva_Rally_Ab_AP10083
కంట్రిబ్యూటర్ : కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా విశాఖలో రైల్వే ఉద్యోగులు మరియు అధికారులు స్వచ్ఛభారత్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.

Body:దొండపర్తి లోని డిఆర్ఎం కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ విశాఖ రైల్వేస్టేషన్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో వాల్తేర్ డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్ పాల్గొన్నారు.

Conclusion:ఈ సందర్భంగా గా ప్లాస్టిక్ నిషేధం, చెత్తను పారవేయడం, బహిరంగ ప్రదేశాలలో మల మూత్ర విసర్జన చేయడం వంటి అంశాలపై రైల్వే కళాకారులు చేసిన నాటిక అందరినీ ఆకట్టుకుంది. విశాఖ రైల్వేస్టేషన్, పరిసర ప్రాంతాలతో పాటు వాల్తేర్ డివిజన్ లోని బొబ్బిలి, విజయనగరం, రాయగడ, కోరాపుట్, జగదల్ పూర్ లలో కూడా స్వచ్ఛతా హి సేవ పేరిట అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని డిఆర్ఎం వివరించారు.

బైట్: చేతన్ కుమార్ శ్రీవాస్తవ్, వాల్తేర్ డిఆర్ఎం.
Last Updated : Sep 16, 2019, 4:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.