తిరుపతి రుయా ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది. ఫిర్యాదులు నిజమైతే తీవ్ర మానవహక్కుల ఉల్లంఘన అవుతుందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యాఖ్యానించింది. రుయా ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్య శాఖను ఆదేశించింది. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆక్సిజన్ కొరతతో 11 మంది చనిపోయారని సుధాకర్ ఫిర్యాదు చేశారు. రుయాలో 30 మంది చనిపోయారని చింతా మోహన్ ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండీ... 'వైఎస్సార్ మత్స్యకార భరోసా' నిధుల విడుదల