ETV Bharat / state

11 కేసులు.. 'కోటి రూపాయల సొత్తు రికవరీ.. ఏడుగురు అరెస్ట్

author img

By

Published : Dec 31, 2020, 10:44 PM IST

తిరుపతి అర్బన్ పోలీస్ పరిధిలోని 11 కేసులను పోలీసులు ఛేదించారు. ప్రత్యేక బృందాల సాయంతో సుమారు కోటి రూపాయల విలువైన చోరీ సొత్తును రికవరీ చేసినట్టు తెలిపారు. నిందితులందరూ పాతనేరస్థులేనని తిరుపతి క్రైం ఇన్ ఛార్జి ఏఎస్పీ స్పష్టం చేశారు.

stolen property recovered by police
11 కేసులకు చెందిన 'కోటి రూపాయల సొత్తు రికవరీ.. 7 గురు అరెస్ట్

చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ పోలీస్ పరిధిలోని.. పలు స్టేషన్లలో నమోదైన 11 కేసులను పోలీసులు ఛేదించారు. కేసులకు సంబంధించి ఏడు గురు అంతరాష్ట్ర నేరస్థులను అరెస్ట్ చేశారు. వీరిలో తిరుపతిలో నకిలీ ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతూ తితిదేలో ఉద్యోగాలు, డ్వాక్రా మహిళలకు ఇసుక క్వారీలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి రూ. 39 లక్షల మేర మోసాలకు పాల్పడిన మహమ్మద్ ముస్తాక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసిన క్రైం పోలీసులు అతడి నుంచి 12లక్షల రూపాయలు రికవరీ చేశారు.

తిరుపతి అర్బన్ పరిధిలోని పలు స్టేషన్లలకు సంబంధించిన కేసుల్లో చోరీ అయిన 845 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి, 9 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. ఈ కేసుల్లో రికవరీ చేసిన సొత్తు విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తేల్చారు. నిందితులంతా పాతనేరస్తులనేనని వివరించిన క్రైం ఇన్ ఛార్జి ఏఎస్పీ మునిరామయ్య.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చోరీ జరిగిన సొత్తును రికవరీ చేశామని తెలిపారు.

ఇదీ చదవండి: ఆదోని ఆర్టీసీ కాలనీలో పరువు హత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.