చిత్తూరు జిల్లా తిరుపతి ఉపఎన్నిక ఎన్నికల కోడ్ షెడ్యూల్ వివరాలను నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా ప్రకటించారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు, శ్రీకాళహస్తి, సత్యవేడుతో పాటు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని....అభ్యర్థులు తమ నామినేషన్లను నెల్లూరులోనే సమర్పించాలని ఆయన తెలిపారు.
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 262 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కోవిడ్ ప్రోటోకాల్ అమలులో ఉన్నందున ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచుతామన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో భద్రపరిచిన ఈవీఎం, వీవీ ప్యాట్లను సిద్ధం చేస్తున్నామన్నారు. 2021 జనవరి 1లోపు 18ఏళ్ల వయస్సు ఉండి ఎన్నికల జాబితాలో నమోదైన వారికే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు..
ఇదీ చూడండి:
విశాఖ - చెన్నై పారిశ్రామిక నడవా కింద నోడ్లుగా మూడు జిల్లాలు ఎంపిక