ETV Bharat / state

తిరుపతికి వస్తే హోమ్ ఐసోలేషన్​లో ఉండాల్సిందే! - CORONA CASES IN TIRUPATI

బయటి రాష్ట్రాల నుంచి తిరుపతికి వచ్చే వ్యక్తులు స్వచ్ఛందంగా హోమ్ ఐసోలేషన్ కావాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా తెలిపారు.

తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా

author img

By

Published : Apr 10, 2021, 5:39 PM IST

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ పీఎస్ గిరీషా సమావేశం నిర్వహించారు. గడచిన వారం రోజులుగా తిరుపతిలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై వాలంటీర్లతో నిఘా ఉంచామన్న కమిషనర్.. క్వారంటైన్, హోమ్ ఐసోలేషన్​లకు స్వచ్ఛందంగా ప్రజలే సహకరించాలన్నారు.

మహారాష్ట్ర నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులపై ప్రత్యేక నిఘా ఉంచామన్న ఆయన.. రాత్రిపూట నగరంలో కర్ఫ్యూ విధించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలన్నారు. మాస్కు వాడకాన్ని తప్పనిసరి చేశామన్న కమిషనర్.. ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హితవు పలికారు.

ఇవీ చదవండి

తితిదేలో అర్చకుల కొనసాగింపుపై దేవాదాయ శాఖ నోటిఫికేషన్‌

కుమార్తెతో సహా తండ్రి మృతి.. ఇంతకీ ఆత్మహత్యా? హత్యా?!

సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.