కరోనా ప్రభావంతో వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్న తిరుపతి నగర వీధి వ్యాపారులను ఆర్థికంగా ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీష్ పవార్ తెలిపారు. పీఎం స్వనిధిపై మెప్మా సిబ్బందితో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ లక్ష్యంగా పెట్టుకున్న 4 వేల మంది వీధి విక్రయదారుల్లో 3460 మందికి సంబంధించిన వివరాలు నమోదు చేసినట్లు మెప్మా అధికారులు వివరించారు.
వీధి వ్యాపారులందరికీ చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యమని... తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో తోపుడు బండ్లు, బుట్టతో వ్యాపారం చేసి జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులను గుర్తించాలని కమిషనర్ సూచించారు. ప్రతి వ్యాపారికి రూ.10 వేల రూపాయల రుణం బ్యాంకు ద్వారా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: