ETV Bharat / state

అత్యవసరాలకు అడ్డుగా మారిన బారికేడ్లు..! - శ్రీకాళహస్తి కరోనా కేసుల తాజా వార్తలు

సూళ్లూరుపేట-చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్లు అత్యవసర సేవలకు అడ్డుగా మారాయి. శ్రీకాళహస్తికి వెళ్లే మూడు మార్గాల్లో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పలు గ్రామాల వారు అత్యవసర పరిస్థితుల్లో సూళ్లూరుపేట రావడానికి ఇబ్బందిగా మారింది.

Three roads blockade with full fence construction
అత్యవసరాలకు అడ్డుగా మారిన భారీకేడ్లు
author img

By

Published : May 2, 2020, 10:27 PM IST

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట-చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రజలతోపాటు పలు గ్రామాలు కలిసిపోయి ఉంటాయి. నిత్యావసర వస్తువులకు. వైద్యం కోసం ఇటువారు అటూ... అటువారు ఇటూ వస్తుంటారు. ప్రస్తుతం కరోనా కారణంగా సరిహద్దులను కంచెతో మూసేశారు.

శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం వల్ల ప్రజల ఆరోగ్యం కోసం అధికారులు సూళ్లూరుపేట నుంచి శ్రీకాళహస్తికి వెళ్లే మూడు రోడ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాళెం, బుచ్చినాయుడికండ్రిక, సత్యవేడు గ్రామాల వారు అత్యవసర పరిస్థితుల్లో సూళ్లూరుపేట రావడానికి ఇబ్బందిగా మారింది.

వరదయ్యపాళెం మండలంలోని ఆయ్యవారిపాళెనికి చెందిన నిండు గర్భిణి తన భర్తతో కలసి వైద్యం కోసం సూళ్లూరుపేటకు బయలుదేరగా... పెరిమిటిపాడు చెక్ పోస్టు వద్ద వారిని అడ్డుకున్నారు. ఈ విషయమై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి...

శ్రీకాళహస్తిలో పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.