ETV Bharat / state

three persons died: టిప్పర్‌కు తగిలిన విద్యుత్‌ తీగలు... ముగ్గురు మృతి

current shock
టిప్పర్‌కు తగిలిన విద్యుత్‌ తీగలు
author img

By

Published : Aug 9, 2021, 10:27 AM IST

Updated : Aug 9, 2021, 12:12 PM IST

10:23 August 09

కనికాపురంలో ముగ్గురు మృతి

టిప్పర్‌కు తగిలిన విద్యుత్‌ తీగలు...ముగ్గురు మృతి

కంకర తరలిస్తున్న టిప్పర్​కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పాలసముద్రం మండలం కనికాపురంలో ఉదయం జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్​తో పాటు మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కొల్పోయారు. 

    కనికాపురంలో ఇల్లు నిర్మించుకుంటున్న మునిస్వామి నాయుడు తన అవసరాల కోసం జీడీ నెల్లూరు మండలం వేల్పూరు పెద్ద కాలువ నుంచి టిప్పర్​లో కంకరు తెప్పించారు. మునిస్వామి నాయుడు ఇంటి సమీపంలో కంకరను అన్‌లోడ్‌ చేసే సమయంలో విద్యుత్ తీగలు గమనించని డ్రైవర్ మనోజ్‌‌.. టిప్పర్ వెనక భాగం పైకెత్తాడు. ఈ క్రమంలో టిప్పర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి కరెంట్‌ ప్రవహించింది. దీంతో డ్రైవర్‌ కేకలు వేశాడు. అతడిని కాపాడే క్రమంలో యువకులు జ్యోతీశ్వర్‌, దొరబాబు కూడా విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి:  గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు- 8మంది మృతి

Last Updated : Aug 9, 2021, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.