చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పాతకక్షలు భగ్గుమన్నాయి. పాతపేటలో ముగ్గురు యువకులపై ద్విచక్ర వాహనాలపై వచ్చిన వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దుండగులను స్థానికులు వెంబడించి ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే చోట కత్తులతో దాడి జరగటంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. పాతకక్షలే హత్యాయత్యానికి కారణం అయి ఉండవచ్చని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పారిపోయిన దుండగుల కోసం ముమ్మరంగా గాలింపులు చేపట్టారు. సంఘటనా స్థలంలో దుండగుల బైక్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు యువకులపై కత్తులతో దాడి... పాత కక్షలేనని అనుమానం - knife
చంద్రగిరి పాతపేటలో ఒక్కసారిగా అలజడి రేగింది. ముగ్గురిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పాతకక్షలు భగ్గుమన్నాయి. పాతపేటలో ముగ్గురు యువకులపై ద్విచక్ర వాహనాలపై వచ్చిన వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దుండగులను స్థానికులు వెంబడించి ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే చోట కత్తులతో దాడి జరగటంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. పాతకక్షలే హత్యాయత్యానికి కారణం అయి ఉండవచ్చని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పారిపోయిన దుండగుల కోసం ముమ్మరంగా గాలింపులు చేపట్టారు. సంఘటనా స్థలంలో దుండగుల బైక్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ