చిత్తూరు జిల్లా తిరుచానూరు పరిధిలోని యోగి మల్లవరంలో దారుణం జరిగింది. మద్యం బదులుగా శానిటైజర్లు తాగి గడచిన రెండు రోజుల్లో ముగ్గురు మృతి చెందారు. యోగి మల్లవరంలో చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న మల్లిక, లత, సెల్వం వీరు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
మద్యానికి బానిసలై వీరు మందుకి బదులుగా దాతలు ఇచ్చిన శానిటైజర్లు తాగి మృతిచెందారని తిరుచానూరు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. మృతుల్లో మల్లిక,లత తమిళనాడు రాష్ట్రం కడలూరుకి చెందినవారు కాగా సెల్వంది తిరుపతి పేపర్స్ కాలనీ అని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా వస్తే.. ఆస్పత్రికి వెళ్లడం కంటే ఇల్లే మేలట!