కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 14 మందిలో ముగ్గురి మృతదేహాలను చిత్తూరు జిల్లా మదనపల్లె కు తీసుకువచ్చారు. అజ్మీర్ యాత్ర కోసం 18మందితో టెంపులో బయల్దేరిన నజీరా బీ కుటుంబం... కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ నజీర్, మెకానిక్ షఫీ, మరో మృతురాలు అమీర్ జాన్ తదితరుల మృతదేహలకు కర్నూలు లో శవపరీక్ష నిర్వహించారు. అనంతరం మృత దేహాలను చిత్తూరు జిల్లా మదనపల్లె కి తరలించారు. ఆదివారం రాత్రి 11.30 నిమిషాలకు మూడు మృతదేహాలు మదనపల్లె కు చేరుకున్నాయి. వీరికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. మరో 11మృతదేహాలు చిత్తూరు జిల్లా తరిగొండకు సోమవారం చేరుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి