శ్రీవారి వాహన సేవలు తిరుమలలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మూడో రోజు రాత్రి ముత్యాల పందిరి వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవార్లతో కలసి విశేష తిరువాభరణాలతో అలంకృతుడైన స్వామి కృష్ణ పరమాత్మ రూపంలో తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వాహన సేవలో పాల్గొన్న గజరాజులు, అశ్వాలు, వృషభాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు స్వామి వారి వాహన సేవను వీక్షించారు. అన్నమయ్య ప్రాజెక్టు కళాకారుల కోలాటాలు, అన్నమయ్య కీర్తనలకు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భజన బృందాలు వాహన సేవలో ఆడిపాడాయి. స్వామివారి దివ్యరూపాన్ని కనులారా దర్శించుకున్న భక్తులు గోవింద నామ స్మరణలతో కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు.
ముత్యాల పందిరి వాహనంలో విహరించిన మురళీధరుడు - mutyalapandiri
తిరుమల గిరులపై శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. శ్రీవారి సేవలను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మూడో రోజు రాత్రి స్వామి వారు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ముత్యాల పందిరి వాహనంలో తిరువీధుల్లో విహరించారు.
శ్రీవారి వాహన సేవలు తిరుమలలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మూడో రోజు రాత్రి ముత్యాల పందిరి వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవార్లతో కలసి విశేష తిరువాభరణాలతో అలంకృతుడైన స్వామి కృష్ణ పరమాత్మ రూపంలో తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వాహన సేవలో పాల్గొన్న గజరాజులు, అశ్వాలు, వృషభాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు స్వామి వారి వాహన సేవను వీక్షించారు. అన్నమయ్య ప్రాజెక్టు కళాకారుల కోలాటాలు, అన్నమయ్య కీర్తనలకు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భజన బృందాలు వాహన సేవలో ఆడిపాడాయి. స్వామివారి దివ్యరూపాన్ని కనులారా దర్శించుకున్న భక్తులు గోవింద నామ స్మరణలతో కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు.
Body:v
Conclusion:v