ETV Bharat / state

శ్రీవారి బ్రహ్మోత్సవం... వీక్షించిన భక్తులకు నేత్రోత్సవం... - తిరుమల బ్రహ్మోత్సవాలు మూడో రోజు సేవలు

అపురూపం స్వామి దర్శనం... ఎటు చూసినా భక్తి పారవశ్యం. వివిధ వాహన సేవల్లో తిరువీధుల్లో ఉరేగుతోన్న స్వామిని చూస్తే ఏ భక్తునికైనా ఈ క్షణం ఇలా ఆగిపోతే చాలు అనిపిస్తుంది. ఆది శేషుని వాహనమైనా, రాక్షసత్వాన్ని శిక్షించిన సింహ స్వరూపంలోని సింహ వాహనమైనా, ఆకాశంలో నక్షత్రాల్లా ముత్యాలతో అలంకరించే  ముత్యపు పందిరి వాహనమైనా వేటికవే సాటి. గోవిందా... గోవిందా అంటూ తిరుమల మాడ వీధులు ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. అంగరంగ వైభవంగా సాగుతోన్న ఆ దేవదేవుని బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు వాహన సేవలు విశేషాలు తెలుసుకుందామా...

శ్రీవారి బ్రహ్మోత్సవం
author img

By

Published : Oct 2, 2019, 5:49 AM IST

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కలియుగ వైకుంఠవాసుడు తిరుమాడ వీధుల్లో వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఉత్సవాల మూడో రోజు ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై దర్శనమిస్తారు. బ్రహ్మ, విష్ణు, శివాత్మకమైన నరసింహ స్వామి రూపంలో ఉన్న మలయప్ప స్వామి... పరాక్రమానికి ప్రతీకగా భావించే సింహ వాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో ఊరేగుతారు.

అపురూపం సింహ వాహనం

హిరణ్యకశిపుని సంహరించిన నృసింహస్వామి రూపంలో ఉన్న శ్రీవారిని దర్శించుకుంటే పాపాలు పటా పంచలై సత్వ గుణం ప్రసాదితమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. మదిలో దుష్ట భావనలు తొలగుతాయన్న నమ్మకంతో సింహ వాహనంపై ఊరేగే వైకుంఠ నాథుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.

రాత్రికి ముత్యపు పందిరి వాహనం

బ్రహ్మోత్సవాల మూడో రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి మాడవీధుల్లో ఊరేగుతారు. తెల్లటి ముత్యాలతో రూపొందించిన నాలుగు స్తంభాలు, శిఖరంతో కూడుకున్న బంగారు పందిరికి ముత్యాల సరాలు, తోరణాలు, ముత్యాల కుచ్చులతో వాహనాన్ని సర్వాంగసుందరంగా అలంకరిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి... శ్రీ కృష్ణ అవతారంలో రుక్మిణీ, సత్యభామలతో కలిసి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఉభయ దేవేరులతో కలిసి నాలుగు మాఢ వీధుల్లో విహరిస్తూ అభయ ప్రదానం చేస్తున్న స్వామివారిని దర్శించుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో మాడవీధులు కిక్కిరిసిపోతున్నాయి. దేశంలోని పద్నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనలు భక్తులను అలరిస్తున్నాయి..

శ్రీవారి బ్రహ్మోత్సవం... వీక్షించిన భక్తులకు నేత్రోత్సవం...

ఇదీ చూడండి:

'మహాత్మా...మళ్లీ రావా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.