తిరుపతి శివారులో మరో భారీ చోరీ వెలుగుచూసింది. తిరుచానూరు సుబ్బయ్య కాలనీలోని.. సౌభాగ్య అపార్టుమెంట్‌లో సోమవారం రాత్రి దోపిడీ జరిగింది. అపార్టుమెంటులోకి చొరబడ్డ దుండగులు.. ప్లాట్ నెం 306లోని రైల్వే ఉద్యోగి నాగిరెడ్డి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. 275 గ్రాముల బంగారం,1300 గ్రాముల వెండితో పాటు ఇతర వస్తువులు అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై.. వారు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చెడ్డీ గ్యాంగ్ పనిగా వారు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: