చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో దశాబ్ధాలుగా కరవుతో అల్లాడిపోతున్నాయి. ఈ ప్రాంతంలో పశువులు మృత్యు వాత పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై దాణా, పాతర గడ్డి, ఇతర పశుగ్రాసం సరఫరా చేస్తున్నాయి. ఇవి పశువుల నోటి వరకు రావడం లేదంటున్నారు పశుకాపరులు. ప్రైవేటువ్యక్తుల వద్ద ట్రాక్టర్ లోడ్ వరిగడ్డి 15 నుంచి 20 వేల రూపాయలకు కొనలేకపోతున్నామని.. ప్రభుత్వ రాయితీ దాణా దొరక్క ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు. పశు సంవర్ధక శాఖాధికారులకు సొమ్ము చెల్లించినా పాతర గడ్డి అందక సమస్యలు ఎదుర్కొంటున్నారీ పోషకులు. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేదని ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తున్నారు అధికారులు. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పాతర గడ్డి అక్రమంగా విక్రయిస్తున్న సంగతి వెలుగుచూస్తోంది. పాతర గడ్డి మూటలు ప్రైవేటు వ్యాపారులకు చేరుతోంది.
కొందరు రైతులు పాడి పరిశ్రమను కాపాడుకోవడానికి బిస్కెట్ పరిశ్రమల్లో వృథాగా పడి ఉన్న పదార్థాలను దాణాగా అందిస్తున్నారు. ఇలాంటి పదార్థాలు తిని వేల సంఖ్యలో జీవులు మృత్యువాత పడుతున్నాయి. వందల సంఖ్యలో జెర్సీ రకం పాడి ఆవులు, స్వదేశీ నాటి ఆవులు మృత్యువాత పడుతున్నాయి. పాతర గడ్డి, ఇతర దాణా సరఫరాలో జరుగుతున్న అక్రమాలపై స్పందించే అధికారులే లేకుండా పోయారని పశు కాపరులంటున్నారు.
ఇవీ చదవండి