తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారు సూర్యప్రభవాహనంపై ఊరేగుతూ పడమర, ఉత్తర మాడవీధులు కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ మలయప్పస్వామివారిపై సూర్యకిరణాలు తాకిన తరువాత.. అర్చకులు ప్రత్యేక హారతులు, నైవేద్యాలు సమర్పించి వాహన సేవలను ప్రారంభించారు. ఒకేరోజున ఏడు వాహన సేవలు దర్శించుకునే అవకాశం ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో తిరుమాడవీధులు నిండిపోయాయి. ఈ వేడుకకు సంబంధించి మరికొంత సమాచారం ఈ వీడియోలో..
ఇదీ చదవండీ.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఘనంగా కావడి సేవ