చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని దేవలంపేట శివాలయంలో ఇటీవల అదృశ్యమైన నంది విగ్రహం శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో లభ్యమైంది. బంగారుపాలెం ఎస్ ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్వర్ణముఖి నదిలో ధ్వంసం చేసిన నంది విగ్రహం ఆనవాళ్లను గుర్తించారు.
గుప్తనిధుల కోసమే నంది విగ్రహం తవ్వకాలు చేపట్టి... అనుమానం రాకుండా స్వర్ణముఖి నదిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులను బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: