ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరాలయ అభివృద్ధికి నిధులున్నా.. పనుల్లో ఆలస్యం..!

ఏళ్లు గడుస్తున్నాయి.. ప్రభుత్వాలు మారాయి.. అధికారులూ మారుతున్నారు... సమీక్షలు జరుగుతున్నాయి... శ్రీకాళహస్తీశ్వరాలయ అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన బృహత్తర ప్రణాళిక అమలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారింది. అభివృద్ధి పనులకు నిధులు పుష్కలంగా ఉన్నాయి. అయినా సమస్యను పరిష్కరించే దిశగా అధికారగణం శ్రద్ధ చూపకపోవడం విమర్శలకు కారణమవుతోంది. ఈ కారణంగా బృహత్తర ప్రణాళిక ద్వారా సేకరించిన స్థలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.350 కోట్లు కేటాయించారు. ఆలస్యం అమృతం విషమన్నట్లు నిధులు వెనక్కి మళ్లకుండా అభివృద్ధి పనులు ప్రారంభించేలా అధికారగణం దృష్టి సారించాల్సి ఉంది.

The master plan for the development of Srikalahasti temple is not being implemented
శ్రీకాళహస్తి
author img

By

Published : Oct 3, 2020, 12:20 PM IST

శ్రీకాళహస్తీశ్వరాలయ అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన బృహత్తర ప్రణాళిక అమలుకు భూమిని సేకరించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆలయం చుట్టూ ఉన్న సన్నిధివీధి, దిగువ సన్నిధివీధి, రాజగోపురం పరిసర ప్రాంతాలు, భిక్షాలగోపురం నుంచి రంగుల గోపురంలోపు ఉండే దుకాణాలు తదితర వాటికి సంబంధించి 3.9 ఎకరాల విస్తీర్ణంలోని స్థలాన్ని సేకరించాలని నిర్ణయించింది. 199 మంది నిర్వాసితుల్లో ఇప్పటివరకు 192 మంది తమ పత్రాలను ఆలయ అధికారులకు అప్పగించి పరిహారం తీసుకున్నారు.

న్యాయస్థానానికి నిర్వాసితులు

సన్నిధివీధి పరిసర ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకున్న ఏడుగురు నిర్వాసితులు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సరిపోదని ఎక్కువ కావాలని పట్టుపట్టారు. ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బంకమన్నుతో నిర్మించిన ఇళ్లకు సమానంగా అత్యంత ఆధునిక వసతులతో నిర్మించిన వాణిజ్య సముదాయాలకు పరిహారం ఇవ్వడం సరికాదన్నది వాళ్ల వాదన.

ఆమోదం.. ఆనక అభ్యంతరం

నిర్వాసితులతో పలు దఫాలుగా అధికారులు సమీక్షలు జరిపారు. ఈ విషయమై తొలుత లిఖితపూర్వకంగా ఎలాంటి ఆమోదం లేకుండా పోయింది. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయమై దేవాదాయ శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులతోను చర్చలు చేసినట్లు సమాచారం.

ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షణ

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నిర్వాసితుల డిమాండ్ల విషయమై ఉన్నతాధికారులు పలు దఫాలు చర్చలు జరిపారు. జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలోనూ సమీక్షలు నిర్వహించారు. డిమాండ్ల ఆమోదం అన్న విషయాన్ని దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నాం. - వెంకటనారాయణ, ఇన్‌ఛార్జి ఈఈ, శ్రీకాళహస్తీశ్వరాలయం

ఇదీ చదవండి:

గ్రామ పంచాయతీల్లో వెలుగుచూస్తున్న కార్యదర్శుల అవినీతి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.