చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లిలో విషాదం నెలకొంది. గుండెపోటుతో తమ్ముడు మృతి చెందాడన్న వార్త తెలుసుకొని.... అన్న కూడా ప్రాణాలొదిలాడు. గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్ బాబు (50).... వెంకటరామయ్య (47) ఇద్దరు అన్నదమ్ములు. సుబ్రహ్మణ్యం గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాడు. తమ్ముడు వెంకటరామయ్య తిరుపతిలో ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ స్వగ్రామం వచ్చి పొలం పనులు చూసుకునేవాడు. ఈ క్రమంలో స్వగ్రామానికి చేరుకొన్న వెంకట్రామయ్య.... ఉదయం పెళ్ళి పనులకు వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చాడు. ఆ వెంటనే గుండెల్లో నొప్పిగా ఉందంటూ కుప్పకూలిపోయాడు. స్థానికులు 108 వాహనంలో తిరుపతికి తరలించగా.... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం విన్న అన్న సుబ్రమణ్యం కూడా.... హఠాత్తుగా కుప్పకూలాడు. పరీక్షించగా ప్రాణాలు కోల్పోయాడు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: రాష్ట్రంలో 420 కరోనా పాజిటివ్ కేసులు