చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నానం వైభవంగా ముగిసింది. అంతకుముందు ఉదయం 5.00 నుంచి 6.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం, ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు పుష్కరిణికీ ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. 8.00 గంటలకు చక్రస్నానం ఘనంగా జరిగింది. సాయంకాలం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవయజ్ఞం పూర్తవుతుంది. చక్రస్నానంలో తితిదే జేఈవో పి.బసంత్ కుమార్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: