ETV Bharat / state

ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన... వర్చువల్​గా హాజరుకానున్న సీఎం - ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు తాజావార్తలు

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం ఆరోగ్యవరం వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు 30వ తేదీన సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి.. జగన్​ వర్చువల్​ పద్ధతిలో హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు.

collector
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్​
author img

By

Published : May 28, 2021, 9:20 AM IST

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం ఆరోగ్యవరం వద్ద ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఈ నెల 30న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ వెల్లడించారు. వర్చువల్ విధానంలో సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. శంకుస్థాపన జరిగే ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే నవాజ్ భాష, సబ్ కలెక్టర్ జాహ్నవిలతో కలిసి కలెక్టర్​ పరిశీలించారు. ఏర్పాట్లన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్​ మెడికల్​ సర్వీసు మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఎంఐడీసీ) అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక మెడికల్ కళాశాల ఉండాలనేది సీఎం లక్ష్యమని కలెక్టర్​ అన్నారు. చిత్తూరు, కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండే మదనపల్లె పట్టణానికి ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేశారని తెలిపారు. దీని ద్వారా పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గాల ప్రజలకు సత్వర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 52 ఆస్పత్రులకు రూ.3.61కోట్లు జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.