మతిస్థిమితం లేని వ్యక్తి చేతిలో యాచకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటు చేసుకుంది. పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న బస్ షెల్టర్లో యాచకుడు నిద్రిస్తుండగా...అక్కడకి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి బిక్షగాడితో వాగ్వాదానికి దిగాడు. విచక్షణ కోల్పోయిన సదరు వ్యక్తి పక్కనే ఉన్న బండరాయితో యాచకుడి తలపై బలంగా మోదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు యాచకుడి వద్దకు వెళ్లి చూడగా..అప్పటికే మృతి చెందాడు. అక్కడే అనుమానస్పదంగా తిరుగుతున్న మతిస్థిమితంలేని వ్యక్తిని పోలీసులు స్టేషన్కు తరలించి విచారించగా..నేరం చేసిన తీరును వివరించాడు. నిందితుడు తమిళనాడుకు చెందిన అబ్దుల్ అన్వర్గా గుర్తించగా..యాచకుడి వివరాలపై ఆరా తీస్తున్నారు.
ఇదీచదవండి