చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు - నాయుడుపేట జాతీయ రహదారిపై వద్ద పాతకాల్వ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ముందస్తు చర్యలు చేపట్టకుండా పేరూరు చెరువుకు అధికారులు దగ్గరుండి జేసీబీలతో గండి కొట్టడంతో గ్రామంలోకి వరదనీరు వచ్చిందని ఆరోపించారు. గ్రామస్తుల నిరసనలతో జాతీయ రహదారిపై 5 కీలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ నరసప్ప.. తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజలను రోడ్డుపై నుంచి తొలగించే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
ఈ ఘటనలో ఓ మహిళ తలకు బలమైన గాయమైంది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు.. ఆందోళన చేపట్టారు. దీనికి డీఎస్పీ నరసప్ప, అతని సిబ్బందే కారణమని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఘటనా స్థలానికి చేరుకోవడంతో.. ఎమ్మెల్యే రావద్దంటూ ఘోరావ్ చేశారు. ప్రజలకు సర్దిచెప్పడానికి భాస్కర్ రెడ్డి ప్రయత్నం చేశారు.
ఇదీ చదవండి..
MURDER CASE : హత్యకేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్టు