ETV Bharat / state

తంబళ్లపల్లి సామాజిక ఆసుపత్రి​కి రూ.10వేలు విరాళం

తంబళ్లపల్లి వైద్యవిధాన పరిషత్ సామాజిక ఆసుపత్రి​కి రామకృష్ణారెడ్డి, రవిశంకర్​రెడ్డిలు రూ.10 వేలు విరాళం అందించారు. రోగుల మంచాల మరమ్మతులకు వినియోగించాలని కోరారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రోగులకు పాలు, పండ్లు అందజేశారు.

Thambalpally
ఆసుపత్రి​కి పదివేల విరాళం
author img

By

Published : Dec 21, 2020, 5:23 PM IST

చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి వైద్యవిధాన పరిషత్ సామాజిక ఆసుపత్రిలోని రోగుల మంచాల మరమ్మతులకు కన్నెమడుగు దాతలు దేవరింటి రామకృష్ణారెడ్డి, రవిశంకర్​రెడ్డిలు రూ.10 వేలు విరాళంగా అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రోగులకు పాలు, పండ్లు అందజేశారు. మూడు రోడ్ల కూడలి, రాగి మాను క్రాస్​లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్​ రెడ్డి విగ్రహాలకు నివాళులర్పించారు. నవరత్నాలు అమలుపై ప్రచారం నిర్వహించారు.

ఎమ్మెల్యే రక్తదానం

కురబలకోట మండలం అంగళ్లులో సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో పాటు ఆయన అనుచరులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల వైకాపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో జగన్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు.

ఇదీ చదవండి : సీఎం జన్మదినం సందర్భంగా విద్యార్థినిని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే రోజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.