తిరుపతి ఉపఎన్నికల ప్రచారాన్ని తెదేపా విస్తృతం చేసింది. యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు యువనేతలు రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ నేతల వారసులు తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుపు కోసం వినూత్నంగా ప్రచారం చేపట్టారు.
తిరుపతి తారకరామ మైదానంలో ఉదయం నడకకు వచ్చిన వారితో పాటు వివిధ విద్యా సంస్థలకు చెందిన వ్యాయామ విద్యను అభ్యసిస్తున్న యువతను పలకరించారు. ఓటేయడానికి యువత ముందుకు రావాలని యువనేతలు కోరారు. ఓటు హక్కు వినియోగించుకొన్నపుడే రాష్ట్రాభివృద్ధికి పాటుపడే నేతలు ఎంపికవుతారని వారు అన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులను తీసుకురాగలిగే నాయకులను ఎంపిక చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. మైదానంలోని క్రీడాకారులతో కలిసి ఆటలు ఆడారు. ప్రచారంలో కేశినేని శ్వేత, శ్రావణి, మాజీ మంత్రి జవహర్ కుమారుడు సుజిత్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనవరాలు కీర్తి, యువ నాయకుడు శ్రవణ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: