మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని తేదేపా ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గం బాధ్యులు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చారిత్రక నేపథ్యం ఉన్న మదనపల్లెలో అన్ని రకాల వసతులు ఉన్నట్టు చెప్పారు. అలాగే.. పట్టణం బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు.
కోట్ల విజయ భాస్కర్ రెడ్డి వంటి నాయకులు విద్యను అభ్యసించి ఉన్నత పదువులు అలంకరించారని పేర్కొన్నారు. ఆలాగే ఆంధ్ర ఊటీగా పిలవబడే హార్స్లీ హిల్స్, దేశవ్యాప్త గుర్తింపు పొందిన నీరు గట్టు వారి పల్లె పట్టు చీరలే కాా దక్షిణ భారతదేశంలోనే టమాటా ఎగుమతులకు మదనపల్లె మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇంతటి ప్రఖ్యాతి ఉన్న మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:
టిడ్కో ఇళ్లను నిర్మించి పేదలకు ఇవ్వాలని ఎమ్మెల్యే వెలగపూడి దీక్ష