ETV Bharat / state

'దళితులపై దురాగతాలకే వైకాపా పెద్దపీట'

జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడిని తెదేపా నేత బాలవీరాంజనేయస్వామి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. వైకాపా ప్రభుత్వం దళితులపై దురాగతాలకే పెద్దపీట వేస్తోందని దుయ్యబట్టారు.

tdp leaders
tdp leaders
author img

By

Published : Sep 27, 2020, 10:33 PM IST

దళితులపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ ఇంట్లో కూర్చుని ఆనందిస్తున్నారని టీడీఎల్పీ విప్ డోలా బాలవీరాంజనేయస్వామి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను జడ్జి రామకృష్ణ ప్రశ్నించిన కారణంగానే... దాడి జరిగిందన్నారు.

చిత్తూరు జిల్లాలో ఆయన సోదరుడు రామచంద్రని నడిరోడ్డులో హతమార్చేందుకు యత్నించారని ఆరోపించారు. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా.. వారిపైనే దమనకాండకు పాల్పడటం సిగ్గుచేటని బాలవీరాంజనేయస్వామి, అనిత ధ్వజమెత్తారు. దళితులపై దురాగతాలకే వైకాపా పెద్దపీట వేస్తోందని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడిపై దుండగుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.