వైకాపా ప్రభుత్వ అక్రమాలపై ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. 2 రోజులపాటు జరిగిన బడ్జెట్ సమావేశాలపై చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఆయన మాట్లాడారు. తెదేపా నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. తెదేపా హయాంలో ఇలాంటివి చేసుంటే ఒక్క వైకాపా కార్యకర్త ఉండేవాడు కాదని అన్నారు. తెదేపా నేతలను భయపెట్టి తమ పార్టీలోకి తీసుకుంటున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు.
ఇవీ చదవండి..: .శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్