వైకాపా చేస్తున్న అరాచకాలు అంతం చేసేందుకు తిరుపతి ఉప ఎన్నిక క్రియాశీలకంగా మారుతుందని తెదేపా ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. రెండేళ్ల వైకాపా పాలన అవినీతిమయంగా మారిందని ఆయన ఆరోపించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై ఆంధ్ర రాష్ట్రమంతా ఎదురు చూస్తోందని అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెదేపా నాయకులతో రామానాయుడు సమావేశం నిర్వహించారు.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రణాళికలు రూపొందించి.. అత్యంత మెజార్టీతో ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని సూచించారు.