ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత.. తెదేపా నేతల గృహ నిర్బంధం - tdp leaders house arrest at chittor

చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన దృష్ట్యా తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొవిడ్, ఎన్నికల నియమావళి అమలు కారణం చూపుతూ.. తెదేపా నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

tdp leders house arrest at chittor district

author img

By

Published : Mar 1, 2021, 8:00 AM IST

Updated : Mar 1, 2021, 9:37 AM IST

చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన దృష్ట్యా చిత్తూరు, తిరుపతిలో పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబును హౌస్​ అరెస్ట్ చేశారు. చిత్తూరులో తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను గృహ నిర్బంధం చేశారు. రేణిగుంట విమానాశ్రయానికి తరలివెళ్తున్న తెదేపా నేత నర్సింహ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాజులమండ్యం పోలీసుస్టేషన్‌కు నర్సింహ యాదవ్‌ను తరలించారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.

పురపాలక ఎన్నికల్లో పోటీ చేసే తెదేపా అభ్యర్థులపై అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ... చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. చిత్తూరు, తిరుపతిలో తెదేపా నిరసన కార్యక్రమాలకు పార్టీ నేతలు సైతం సిద్ధమయ్యారు. అధికార పార్టీ తీరుకు వ్యతిరేకంగా 5 వేలమందితో నిరసనకు కార్యాచరణ రూపొందించారు. అయితే.. కొవిడ్, ఎన్నికల నియమావళి అమలు దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు.

అయినా.. నిరసన తెలిపేందుకు తెదేపా శ్రేణులు సిద్ధంకాగా.. పోలీసులు పార్టీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. మరికాసేపట్లో చంద్రబాబు రేణిగుంట చేరుకోనున్నారు.

తెదేపా నేతల గృహ నిర్బంధం

ఇదీ చదవండి:

నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు...నిరసనకు అనుమతి నిరాకరణ

Last Updated : Mar 1, 2021, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.