TDP LEADER AMARNATH REDDY ON LOKESH PADAYATRA : ఈ నెల 27 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లా పోలీసులు లోకేశ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతులిచ్చారు. అయితే ఈ షరతులపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేశ్ పాదయాత్రకు అనేక ఆంక్షలు విధించారని ఆ పార్టీ నేత అమర్నాథ్ రెడ్డి ఆగ్రహించారు.
శాంతిభద్రతల సమస్య పరిష్కార బాధ్యత పోలీసులకు లేదా? అని నిలదీశారు. బహిరంగ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టకూడదని, బాణసంచా పేల్చవద్దని షరతు విధించారని మండిపడ్డారు. లోకేశ్ పాదయాత్ర సమయంలో ఎవరో బాణసంచా పేల్చితే ఏం జవాబు చెప్పాలని నిలదీశారు. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా వాహనాలకు పరిమితి విధించారని.. పాదయాత్ర సందర్భంగా రోడ్లపై అనేక వాహనాలు వెళ్తే దానికి ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు.
తాము రాత్రి 10 గంటల వరకు పాదయాత్రకు అనుమతి కోరితే.. సాయంత్రం 5.55 గంటలలోపు ముగించాలన్నారని ఆగ్రహించారు. ఇన్ని షరతులతో ఎలాంటి అనుమతి ఇచ్చారో అర్థం కావట్లేదన్నారు. వెళ్లిన ప్రతిచోట అనుమతులు తీసుకోవాలా? అని ప్రశ్నించారు. లోకేశ్ పాదయాత్రకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందన్న అమర్నాథ్ రెడ్డి.. లోకేశ్ పాదయాత్ర చేస్తే మీరు ఇంటికి వెళ్లక తప్పదనే భయం ఉందని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: