ఓం ప్రతాప్ కుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళ్లేందుకు ప్రయత్నించిన తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా సోమల మండలం కామిరెడ్డిగారిపల్లె సమీపంలోని బండకాడ ఎస్సీ కాలనీకి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను గృహ నిర్బంధం చేశారు.
పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాని, ఎమ్మెల్యే దొరబాబు.. పుంగనూరులో అనిషారెడ్డి, శ్రీనాధరెడ్డితో పాటు పలువురిని నిర్బంధించారు. ఈ చర్యను తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు.
ఇవీ చదవండి: