పార్టీ ప్రాబల్యం కోసం తిరుమల శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని తెదేపా నేత చెంగల్రాయుడు తిరుపతిలో అన్నారు. వైకాపా నేత విజయసాయి రెడ్డిపై వేసిన పరువు నష్టం కేసును తితిదే ఉపసంహరించుకోవడం తగదని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీవారి నగలు మాయమయ్యాయని నిరూపించలేకపోతే 12 గంటల్లో రాజీనామా చేస్తానని సవాలు విసిరారని గుర్తుచేశారు. రెండు సంవత్సరాలు గడచినా ఎందుకు నగల ఆచూకీ తీయలేదని ఆయన ప్రశ్నించారు.
విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై పరువు నష్టం కేసు కొనసాగించాలని...200 కోట్ల రూపాయలు పరువు నష్టం కింద డబ్బులు వసూలు చేసేలా తితిదే కోర్టులో కేసు వాదించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో తితిదే నెగ్గి... తమ స్వార్థం కోసం తిరుమల వెంకన్న ప్రతిష్టను దిగజార్చేలా ప్రకటనలు చేసే నేతలు, వ్యక్తులకు గుణపాఠం చెప్పాలని అన్నారు.
ఇదీ చూడండి. పెళ్లి కోసం హోర్డింగ్పైకి ఎక్కేసిన బాలిక