తెదేపా (TDP) ను బలోపేతం చేయడానికి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy chandramohan reddy) అన్నారు. ఆదివారం ఆయన రాజంపేట (Rajampeta) పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి మదనపల్లిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కృష్ణా జలాల (krishna water) విషయంలో.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దొంగాట ఆడుతున్నారని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మూడు కలిపి అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని.. వీటిని అడ్డుకోకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్ (CM JAGAN) ప్రధానమంత్రికి లేఖలు రాయడం పక్కన పెట్టి.. ప్రత్యక్ష కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
కృష్ణా జలాలు రాయలసీమకు దక్కని దుస్థితి
వైకాపా (YSRCP) అధికారంలోకి వచ్చిన తరువాత.. కృష్ణా జలాలు (krishna water) రాయలసీమకు దక్కని పరిస్థితులు నెలకొన్నాయని సోమిరెడ్డి ఆవేదన చెందారు. స్వార్థ ప్రయోజనాల కోసం వెనుకబడిన రాయలసీమ హక్కులను పట్టించుకునే పరిస్థితులు.. సీఎం జగన్మోహన్ రెడ్డి(CM Jaganmohan Reddy) ప్రభుత్వానికి లేకపోవడం దుదృష్టకారమన్నారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయింది విమర్శించారు.
ప్రాజెక్టుల కోసం రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టాం
తెదేపా హయాంలో రాష్ట్రంలో ప్రాజెక్టుల కోసం రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టామని సోమిరెడ్డి పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు చేస్తున్నారో అర్థం కానీ పరిస్థితి ఏర్పడిందని విమర్శలు సంధించారు. ప్రజలు రోడ్లు మీదికి వచ్చి మానవ హక్కుల కోసం పోరాడే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
రాయచోటిలో...
రాయచోటి తెదేపా కార్యాలయంలో కార్యకర్తలతో సోమిరెడ్డి మాట్లాడారు. తెదేపా హయాంలోనే రాయచోటి అభివృద్ధి చెందిందని గుర్తు చేసుకున్నారు. విశాఖ ఉక్కు, రాయలసీమ నీళ్లు, కృష్ణా జలాల విషయంలో వివాదాలపై సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అంతా కృషి చేయాలని కార్యకర్తలకు సోమిరెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి:
Audio Tape: నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతు.. మావోయిస్టు అరుణ పేరిట ఆడియో టేపు