BC hashtag trending on Twitter: తెలుగుదేశం బీసీల పార్టీ.. అందరి పార్టీ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. తెదేపా జయహో బీసీ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. తెదేపా హయాంలో బీసీలకు జరిగిన మేలు, వైకాపా హయాంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ తెదేపా జయహో బీసీ హ్యాష్ ట్యాగ్‌ని తెదేపా బీసీ విభాగం ట్రెండ్ చేస్తుంది. బీసీ వర్గాలు, బీసీ యువత తమకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ట్వీట్లు, కామెంట్స్ చేస్తున్నారు. బీసీలకు తెదేపా హయాంలో ప్రవేశ పెట్టిన కార్యక్రమాలు జగన్ ప్రభుత్వం రద్దు చేసింది అంటూ సోషల్ మీడియా వేదికగా బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెదేపా జయహో బీసీ హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
-
బీసీ నేతల్ని, కార్యకర్తల్ని అంతమొందించిన నరహంతక జగన్ రెడ్డి సర్కారు జయహో బీసీ సభ నిర్వహించడం సిగ్గుచేటు.(4/4)#TDPJayahoBC #BCDrohiJagan pic.twitter.com/sFRg0pSs7Q
— Lokesh Nara (@naralokesh) December 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">బీసీ నేతల్ని, కార్యకర్తల్ని అంతమొందించిన నరహంతక జగన్ రెడ్డి సర్కారు జయహో బీసీ సభ నిర్వహించడం సిగ్గుచేటు.(4/4)#TDPJayahoBC #BCDrohiJagan pic.twitter.com/sFRg0pSs7Q
— Lokesh Nara (@naralokesh) December 7, 2022బీసీ నేతల్ని, కార్యకర్తల్ని అంతమొందించిన నరహంతక జగన్ రెడ్డి సర్కారు జయహో బీసీ సభ నిర్వహించడం సిగ్గుచేటు.(4/4)#TDPJayahoBC #BCDrohiJagan pic.twitter.com/sFRg0pSs7Q
— Lokesh Nara (@naralokesh) December 7, 2022
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్: అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తరువాత బీసీలు గుర్తొచ్చారా.. జగన్ రెడ్డి అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. బీసీ నేతల్ని, కార్యకర్తల్ని అంతమొందించిన... నరహంతక జగన్ రెడ్డి సర్కారు, జయహో బీసీ సభ నిర్వహించడం సిగ్గుచేటని లోకేశ్ ధ్వజమెత్తారు. వెనకబడిన తరగతుల వెన్నుముక విరిచేసిన వారికి బీసీల పేరెత్తే అర్హత లేదని లోకేశ్ స్పష్టంచేశారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు తెదేపా కల్పించిన 34శాతం రిజర్వేషన్లను, 24శాతానికి తగ్గించినందుకు జగన్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు. 2.70 కోట్ల మంది వెనకబడిన తరగతుల జనాభా సబ్ ప్లాన్ నిధులు మళ్లించి... బీసీలకి చేసింది ద్రోహం కాదా అంటూ మండిపడ్డారు. ముఖ్య పదవులు తన సామాజిక వర్గానికి ఇచ్చుకొని బీసీలకు చేసిన సామాజిక అన్యాయంపై.. బీసీ సభావేదిక నుంచి జగన్ సమాధానం చెప్పాలన్నారు.
ఇవీ చదవండి: