Student Misba Suicide case News: 'మీకు తెలుగుదేశం అండగా ఉంటుంది' అని చిత్తూరు జిల్లాలో ఆత్మహత్య చేస్తుకున్న విద్యార్థిని మిస్బా తల్లిదండ్రులకు తెదేపా అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. మిస్బా కుటుంబసభ్యులను చంద్రబాబు ఫోన్ ద్వారా పరామర్శించారు. ఈ సందర్భంగా.. తమకు న్యాయం చేయాలని చంద్రబాబును మిస్బా తల్లిదండ్రులు కోరారు. మిస్బాకు జరిగిన అన్యాయం.. మరొకరికి జరగకుండా ఉండేలా తెదేపా పోరాటం చేస్తుందని చంద్రబాబు తెలిపారు.
చిత్తూరు జిల్లాలోని మిస్బా ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి.. విద్యార్థిని తల్లిదండ్రులతో ఫోన్ ద్వారా చంద్రబాబుతో మాట్లాడించారు. తెదేపా తరపున మిస్బా కుటుంబసభ్యులకు అమరనాథ్ రెడ్డి ఆర్ధికసాయం అందజేశారు. చదువుల్లో రాణిస్తుందని వివక్ష చూపడంతోనే మనోవేదనకు గురైన మిస్బా.. ఆత్మహత్యకు పాల్పడిందని అమరనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను శిక్షించాలని.. మిస్బా కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.