హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా ఉందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. తిరుపతిలోని ఆమె ఇంటి వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరాచక ప్రభుత్వానికి న్యాయదేవత దండన విధించిందంటూ బ్యానర్లను ప్రదర్శించారు. నిమ్మగడ్డ రమేశ్ ను తొలగించేందుకు జీవోలు తీసుకొచ్చిన ప్రభుత్వానికి ఇది చెంపపెట్టులాంటిదని మాజీఎమ్మెల్యే సుగుణమ్మ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్దంగా, చట్టబద్దంగా పరిపాలించాలని సూచించారు.
ఇదీ చదవండి: ఈ క్షణం నుంచి నిమ్మగడ్డే ఎస్ఈసీ: జంధ్యాల