ETV Bharat / state

చిత్తూరులో తానా చైతన్య స్రవంతి సంబరాలు.. దివ్యాంగులు, విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ - నేటి తెలుగు వార్తలు

Tana Celebrations : చిత్తూరు జిల్లాలో తానా ఆధ్వర్యంలో చైతన్య స్రవంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు, దివ్యాంగులకు సైకిళ్లను పంపిణీ చేయగా.. రైతులకు స్ప్రేయర్లను అందించారు. పలు రంగాలలో సేవలు అందించిన వ్యక్తులను సత్కరించారు.

Tana Celebrations
తానా చైతన్య స్రవంతి ఉత్సవాలు
author img

By

Published : Dec 29, 2022, 10:43 PM IST

Tana Celebrations : చిత్తూరులో తానా చైతన్య స్రవంతి ఉత్సవాలను, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రవాస భారతీయుల సంఘం సమన్వయకర్త నెక్​ రమేశ్​ బాబు అధ్యక్షతన నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అంతేకాకుండా వికలాంగులకూ ట్రై సైకిళ్లను, మహిళలకు కుట్టు మిషన్​లను, రైతులకు స్ప్రేయర్లను అందించారు. వివిధ రంగాలలో విశేష సేవలను అందించిన వ్యక్తులను గుర్తించి వారిని సత్కరించారు. బాలాజీ హెచరీస్​ అధినేత దివంగత డాక్టర్​ ఉప్పలపాటి సుందరనాయుడు పౌల్ట్రీ రంగానికి అందించిన సేవలకుగాను.. ఆయన తరపున నెక్​ రమేశ్​ బాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, నగర మేయర్ అముద, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి పాల్గొన్నారు.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.